![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -422 లో.. జ్యోత్స్న పెళ్లి గురించి శివన్నారాయణ బాధపడుతుంటే దీప వచ్చి మీరేం బాధపడకండి ఇది కాకపోతే ఇంతకన్నా మంచి సంబంధం వస్తుంది. మీ మనవరాలికి పెళ్లి అయి మీరు ముని మనవళ్ళతో ఆడుకుంటారని దీప అంటుంది. దీప అనే ప్రతీ మాట నిజమవుతుందని దశరథ్ అంటాడు.
అందరు కాసేపు ఇక్కడ నుండి వెళ్లిపోండి అని శివన్నారాయణ అంటాడు.. మరొకవైపు కుబేర్ ఫోటో చూస్తూ అనసూయ బాధపడుతుంది. ఫోటో కింద పడిపోతుంటే అప్పుడే దీప వస్తుంది. రేపు మీ నాన్న ఆర్ధికమని అనసూయ అంటుంది. చేద్దామని దీప అనగానే నువు చెయ్యకూడదు. మీ నాన్న ఎక్కాడో ఒక దగ్గర ఉన్నాడు.. నువ్వు ఈ పెంచిన నాన్నకి ఇలా చేస్తే కన్ననాన్నకి అరిష్టం.... అందుకే నేను చేస్తానని అనసూయ అంటుంది. దీప బాధపడుతుంటే కార్తీక్ వచ్చి ఏమైందని అడుగుతాడు. ఇలా నేను చెయ్యకూడదంట అని దీప అనగానే ఏం కాదు నువ్వే చెయ్ అని కార్తీక్ చెప్తాడు.
మరుసటిరోజు దీప, కార్తీక్ శివన్నారాయణ ఇంటికి వెళ్లి.. ఈ రోజు త్వరగా వెళ్ళిపోతాం.. రేపు రామని చెప్తారు. ఎందుకని జ్యోత్స్న అడుగుతుంది. రేపు అనసూయ గారి తమ్ముడి ఆర్థికమని కార్తీక్ అనగానే దీప వాళ్ళ నాన్న అనొచ్చు కదా అని పారిజాతం అంటుంది. వాళ్లకు రేపు డబ్బు అవసరం ఉంటుంది ఇచ్చి పంపించండి అని శివన్నారాయణ అంటాడు. మీరు రేపు అందరు రావాలని దీప అంటుంది. నాకు వర్క్ ఉందని శివన్నారాయణ అంటాడు. నేను సుమిత్ర వస్తామని దశరథ్ అంటాడు. నేను కూడా వస్తానని జ్యోత్స్న అంటుంది. నేను వస్తానని పారిజాతం అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |